Header Banner

మాచర్లలో తీవ్ర ఉద్రిక్తత! టీడీపీ కార్యకర్తల జంట హత్యలు! గొడ్డలితో వెంటాడి...

  Sun May 25, 2025 07:25        Politics

మాచర్ల నియోజకవర్గంలో జరిగిన రెండు జంట హత్యలు ఏపీ వ్యాప్తంగా కలకలం సృష్టించాయి. టీడీపీ వర్గీయులను ప్రత్యర్థులు దారుణంగా నరికి చంపేశారు. ఈ సంఘటనపై ప్రభుత్వం సీరియస్‌ అయింది. ఈ మేరకు పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

 

మాచర్ల నియోజకవర్గంలో (Macherla Constituency) ఇవాళ (శనివారం) రెండు జంట హత్యలు జరిగాయి. వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ వర్గీయులు కోటేశ్వరరావు, వెంకటేశ్వర్లను దారుణంగా ప్రత్యర్థులు నరికి చంపేశారు. వ్యక్తిగత పనుల నిమిత్తం బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని కారుతో వెంబడించారు. ఆ తర్వాత బైక్‌ను బలంగా ఢీకొట్టడంతో వారు కిందపడిపోయారు. ఆ ఇద్దరిని గొడ్డళ్లతో ప్రత్యర్థులు నరికి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

 

ఇది కూడా చదవండి: విజయవాడ విమానాశ్రయానికి మహర్దశ! ఇక నుండి అక్కడికి డైరెక్ట్ సర్వీసులు!

 


రాజకీయ కారణాలతోనే ప్రత్యర్థులు ఈ హత్యకు పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏపీ వ్యాప్తంగా ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో ఇద్దరిని కోల్పోవడంతో బాధిత కుటుంబాలు తీవ్రశోకంలో మునిగిపోయాయి. తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ ఘటనతో మాచర్ల నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ జంట హత్యలపై ప్రభుత్వం సీరియస్ అయింది.

 

మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి, పల్నాడు జిల్లా ఎస్పీతో ఇన్‌చార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడారు. హత్యకు జరిగిన కారణాలు, ఈ ఘటన పూర్వాపరాలను ఎస్పీని అడిగి మంత్రి గొట్టిపాటి తెలుసుకున్నారు. వెంటనే హోంమంత్రి అనితతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహించేవారు ఎంతటి వారైనా వదలబోమని హెచ్చరించారు. ప్రత్యర్థుల దాడిలో మృతి చెందిన వారి కుటుంబాలకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ సంతాపం ప్రకటించారు. టీడీపీ నేతలు కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెబుతున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు ఈ కేసును ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్నారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు సీఐ రాచమర్యాదలు! ప్రజల ఆగ్రహం..!


ఏపీలో మెగా డీఎస్సీ వాయిదా పిటిషన్లు! సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!


భారత్ లో కొత్త బైక్ లాంచ్ చేసిన హోండా! ఆధునిక ఫీచర్లు, ఆకట్టుకునే డిజైన్‌తో...


విజ్ఞానశాస్త్రంలో మరో ముందడుగు! యాంటీమ్యాటర్ రవాణాకు ప్రత్యేక కంటైనర్!


కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌తో సీఎం చంద్రబాబు భేటీ..! ఏం చర్చించారంటే?



ఎంపీ డీకే అరుణకు కీలక బాధ్యత అప్పగించిన కేంద్రం! ధాన్యం సేకరణపై ప్రత్యేక ఫోకస్!

అది నిజం కాకపోతే జగన్ రాజీనామా చేస్తారా? టీడీపీ నేత సవాల్!


తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాలు! కేఆర్ఎంబీ కీలక ఉత్తర్వులు!


సైన్స్‌కే సవాల్..! చంద్రుడినే పవర్ హౌస్‌గా మారుస్తామంటున్న ఎడారి దేశం..!

 

టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!

 

ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #Macherla #TDPWorkers #TDPNews #PoliticalViolence #AndhraPradeshNews #BreakingNews #TeluguPolitics #TDP